ఆధునిక సాంకేతికత ఉపయోగకరం

డెహ్రాడూన్​ రాజ్​ భవన్​ లో వర్చువల్​ పర్యాటకం ప్రారంభం ఏఐ ద్వారా నూతన ప్రయోగాలకు అధ్యక్షురాలు ద్రౌపదీ ముర్మూ శ్రీకారం

Apr 24, 2024 - 20:08
 0
ఆధునిక సాంకేతికత ఉపయోగకరం
డెహ్రాడూన్​: ప్రస్తుత సమాజంలో ఆధునిక సాంకేతికత ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని భారత రాష్​ర్టపతి ద్రౌపదీ ముర్మూ అన్నారు. బుధవారం డెహ్రాడూన్​ లోని రాజ్​ భవన్​ లో వర్చువల్​ పర్యాటక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏఐ టెక్నాలజీ ద్వారా రాజ్​ భవన్​ లో కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ ప్రయత్నాలలో వర్చువల్​ పర్యాటకం కూడా ఒకటి ముర్మూ వివరించారు. భవిష్యత్​ లో ఈ సాంకేతికతతో దేశానికి మేలు చేకూరుతుందని తెలిపారు. 
వర్చువల్​ పర్యాటకం ద్వారా ప్రజలు డెహ్రాడూన్​ రాజ్​ భవన్​ లో ఉన్న బోన్సాయ్ గార్డెన్, నక్షత్ర వాటిక, రాజప్రజ్ఞేశ్వర్ మహాదేవ్ దేవాలయం, రాజ్ భవన్ ఆరోగ్యధామ్, రాజలక్ష్మి గోశాల, గ్రంథాలయం డిజిటల్ పర్యాటక అనుభవాన్ని పొందొచ్చని తెలిపారు. 
యూపీఈఎస్​ విశ్వవిద్యాలయం (యూనివర్సిటీ ఆఫ్​ పెట్రోలియం అండ్​ ఎనర్జీ స్టడీస్​) విశ్వవిద్యాలయం సహకారంతో తయారు చేశారు. 
ఈ కార్యక్రమంలో అత్యధికులు పాల్గొని వారసత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలని తెలిపారు. అదే విధంగా తమ తమ నూతన అనుభవాలను పంచుకోవాలని ముర్మూ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రథమ మహిళ గుర్మీత్ కౌర్, గవర్నర్ కార్యదర్శి రవినాథ్ రామన్, అదనపు కార్యదర్శి స్వాతి ఎస్ భదౌరియా, యూపీఈఎస్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్​ శ్రీరామ్ శర్మ, జాయింట్ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ డా. నితిన్ ఉపాధ్యాయ్, వీరేంద్ర సింగ్ పుండిర్, ప్రొఫెసర్​ పంకజ్ బదోని తదితరులు పాల్గొన్నారు.