బీజేపీ పదో జాబితా విడుదల
యూపీ నుంచి ఏడుగురికి అవకాశం
లక్నో: ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను 10వ జాబితాలో బీజేపీ బుధవారం ప్రకటించింది. జాబితాలో మొత్తం తొమ్మిది మందికి స్థానం కల్పించింది. అయితే యూపీ నుంచి ఏడు స్థానాలు మెయిన్‌పురి, కౌశంబి, ఫుల్‌పూర్, అలహాబాద్, బల్లియా, మచిలిషహర్, ఘాజీపూర్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
మైన్‌పురి నుంచి జైవీర్ సింగ్ ఠాకూర్, కౌశాంబి నుంచి వినోద్ సోంకర్, ఫుల్‌పూర్ నుంచి ప్రవీణ్ పటేల్, అలహాబాద్ నుంచి నీరజ్ త్రిపాఠి, బల్లియా నుంచి నీరజ్ శేఖర్, మచ్చిలిషహర్ నుంచి బీపీ సరోజ్, ఘాజీపూర్ నుంచి పరాస్ నాథ్ రాయ్ అభ్యర్థులుగా నిలిచారు. బల్లియా, అలహాబాద్‌ల అభ్యర్థులను బీజేపీ మార్చింది. అలహాబాద్ ఎంపీ రీటా బహుగుణ జోషి స్థానంలో నీరజ్ త్రిపాఠి బరిలోకి దిగారు. బల్లియా నుంచి సిట్టింగ్ ఎంపీ వీరేంద్ర సింగ్ మస్త్ టికెట్‌ను బీజేపీ రద్దు చేసి మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్‌కు కేటాయించింది.