టైసన్​ ఓడెన్​!

Tyson Oden!

Nov 16, 2024 - 13:59
 0
టైసన్​ ఓడెన్​!

టెక్సాస్​: ప్రపంచ ప్రఖ్యాత బాక్సింగ్​ ఆటగాడు మైక్​ టైసన్​ ఓడిపోయాడు. శనివారం టెక్సాస్​ ఏటీ అండ్​ టీ స్టేడియంలో అమెరికన్​ బాక్సర్​ జాక్​ పాల్​ తో తలపడ్డాడు. మైక్​ టైసన్​ 19 యేళ్ల తరువాత బాక్సింగ్​ పోటీలో రంగంలోకి దిగాడు. టైసన్​ తనకంటే 31యేళ్ల చిన్నవాడైన జాక్​ పాల్​ తో తలపడి ఓటమిని చవి చూశాడు. జాక్​ పాల్​ 78–74 తేడాతో టైసన్​ పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్​ నెట్​ ఫ్లిక్స్​ లో ప్రత్యక్ష ప్రసారం కావడంతో ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు భారీగా వీక్షించారు. ఒక్కసారిగా ఈ సంస్థ సర్వర్​ పై భారం పడి సేవలు సుమారు ఆరుగంటలపాటు నిలిచిపోయాయి. మొత్తం ప్రైజ్​ మనీ రూ. 506 కోట్లు కాగా విజేత అయిన జాక్​ పాల్​ కు రూ. 338 కోట్లు, మైక్​ టైసన్​ కు రూ. 169 కోట్లు దక్కాయి. అయితే టైసన్​ చివరి మ్యాచ్​ గెలిచి బాక్సింగ్​ కు ముగింపు పలుకుదామని నిశ్చయించుకున్నాడు. కానీ చివరి మ్యాచ్​ లో ఓటమి చెందడంతో ఆయనలో, ఆయన అభిమానుల్లో నిరాశే ఎదురయ్యింది.