జేపీసీకి జమిలి బిల్లు!

Jamili bill for JPC!

Dec 20, 2024 - 15:08
 0
జేపీసీకి జమిలి బిల్లు!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వన్​ నేషన్​ వన్​ ఎలక్షన్​ బిల్లు (జమిలి) జేపీసీ (జాయింట్​ పార్లమెంటరీ కమిటి)కి పంపించారు. అనంతరం లోక్​ సభలో గందరగోళం తరువాత నిరవధిక వాయిదా వేశారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్​ రామ్​ మేఘ్వాల్​ రాజ్యాంగ సవరణ బిల్లును జేపీసీ వర్కింగ్​ కమిటీకి పంపాలని ప్రతిపాదించారు. మూజువాణి ఓటుతో ప్రతిపాదనకు ఆమోదం లభించింది. జేపీసీలో 27 మంది సభ్యులుండగా వీరిలో 12 మంది రాజ్యసభ సభ్యులున్నారు.

జేపీసీ కమిటీలో ప్రముఖ రాజ్యసభ ఎంపీలు ఘనశ్యామ్ తివారీ, భువనేశ్వర్ కలితా, కె. లక్ష్మణ్, కవితా పటీదార్, సంజయ్ కుమార్ ఝా, రణదీప్ సింగ్ సూర్జేవాలా, ముకుల్ బాలకృష్ణ వాస్నిక్, సాకేత్ గోఖలే, పీఎస్ విల్సన్, సంజయ్ సింగ్, మానస్ రంజన్ మంగరాజ్, వీఎస్ విజయసాయి రెడ్డి ఉన్నారు.

బీజేపీ ఎంపీలు బైజయంత్ పాండా, సంజయ్ జైస్వాల్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన చోటాలాల్, శివసేన (యూబీటీ) అనిల్ దేశాయ్, లోక్ జనశక్తి పార్టీకి చెందిన శాంభవి, సీపీఐ(ఎం)లతో సహా పలు పార్టీలకు చెందిన వారున్నారు.

ప్యానెల్ సభ్యులు..
- పీపీ చౌదరి, సీఎం రమేష్, బాన్సూరి స్వరాజ్, పర్షోత్తంబాయి రూపాలా, అనురాగ్ సింగ్ ఠాకూర్, విష్ణు దయాళ్ రామ్, భర్తృహరి మహతాబ్,  సంబిత్ పాత్ర, అనిల్ బలూని, విష్ణు దత్ శర్మ, ప్రియాంక గాంధీ వాద్రా, మనీష్ తివారీ, సుఖదేవ్ భగత్, ధర్మేంద్ర యాదవ్, కళ్యాణ్ బెనర్జీ, టీఎం సెల్వగణపతి, జీఎం హరీష్ బాలయోగి, సుప్రియా సూలే, శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, చందన్ చౌహాన్, -బాలశౌరి వల్లభనేనిలు ప్యానెల్​ సభ్యులుగా ఉన్నారు.