మైనార్టీలు, ఆలయాలపై దాడులు

Attacks on minorities and temples

Aug 6, 2024 - 13:56
 0
మైనార్టీలు, ఆలయాలపై దాడులు

ఢాకా: బంగ్లాదేశ్​ లో రాజకీయ అస్థిరత నేపథ్యంలో హిందువులు, మైనార్టీలు, ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. 27 జిల్లాల్లోని హిందువులు, జైనులు, బౌద్ధుల ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాలను అల్లరిమూకలు టార్గెట్​ చేసుకొని వారిపై దాడులకు పాల్పడి దోచుకోవడమే గాకుండా నిప్పు పెడుతున్నారు. దీంతో వీరి బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో మైనార్టీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తేలిపారా, కలిగంజ్​ లోని చంద్రపూర్​, హతిబంధ పుర్భో సర్దుబీ, ఢాకా, ధన్మొండి లలోని భారత సాంస్కృతిక సెంటర్​లోని నాలుగు ఆలయాలపై దాడులకు పాల్పడ్డారు. పలువురు హిందువుల ఇళ్లను దోచుకొని ధ్వంసం చేశారు. అడ్డు వచ్చిన వారిని చితకబాదారు. దినాజ్​ పూర్​ లో హిందువుల ఇళ్లు, ఆలయాలను ధ్వంసం చేశారు. బరాబందర్​ లోని పలువురు మైనార్టీలు, రాజకీయ నేతల ఇళ్లు, ఆలయాల ధ్వంసానికి పాల్పడ్డారు.