రాష్ట్రపతికి ఫిజీ అత్యున్నత పురస్కారం
‘కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’తో సత్కారం ఎన్నటికీ మరిచిపోలేని గౌరవమన్న ద్రౌపదీ ముర్మూ
సూవ: ఫీజీలో రాష్ట్రపతి రౌపదీ ముర్మూకు ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’తో సత్కరించింది. ఆగస్ట్ 5నుంచి ఫీజీలో మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి పర్యటిస్తున్నారు. మంగళవారం ఫిజీ రాష్ట్రపతి విలియమే మావలిలీ కటోనివేర్ ముర్మూకు ఈ పురస్కారం ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ఈ పురస్కారం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాల్లో మరింత బలోపేతం అవుతాయని ఆకాంక్షించారు.
కాగా ఫిజీకి చేరుకున్న రాష్ట్రపతికి ఆ దేశ ప్రధానమంత్రి సితివేణి రబుకా ఘన స్వాగతం పలికారు. అనంతరం సూవలోని రాష్ట్రపతి నిలయమైన స్టేట్ హౌస్ లో ద్రౌపదీ ముర్మూకు ఘన స్వాగతం లభించింది.
పురస్కారం దక్కించుకున్న రాష్ట్రపతి సోషల్ మీడియా ద్వారా సంతోషం వ్యక్తం చేస్తూ దేశ ప్రజల ఆప్యాయత తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. తన మొదటి సందర్శన అయినప్పటికీ తన సొంత ఇంట్లో ఉన్నట్లుగా భావిస్తున్నానని తెలిపారు. మరోవైపు ద్వైపాక్షిక చర్చలు సానుకూలంగా కొనసాగాయన్నారు. ఫీజీ అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ న్యూజిలాండ్, తైమూర్ లెస్టేలను సందర్శించనున్నారు.