డా. మన్మోహన్​ ను బాధ పెట్టిన క్షణాలు

Moments that hurt Dr. Manmohan

Dec 27, 2024 - 13:54
 0
డా. మన్మోహన్​ ను బాధ పెట్టిన క్షణాలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: డా. మన్మోహన్​ సింగ్​ హయాంలో పలు తప్పిదాలు, కుంభకోణాలు ఆయన్ను చాలా బాధపెట్టాయి. ఈ విషయాన్ని పలువురు ప్రముఖులతో ఆయన చెప్పేవారు. తరువాతి కాలంలో పలు పుస్తకాలలో ఇందుకు సంబంధించిన వివరాలు అచ్చయ్యాయి. 

2జీ -బొగ్గు కుంభకోణంతో ప్రభుత్వం విమర్శలు వచ్చాయి. 2014లో కాంగ్రెస్​ పార్టీ ఓటమిపాలైంది. 

2013లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాజకీయాలలో నేరస్థుల ప్రవేశాన్ని నిలిపివేయాలనే ఆర్డినెన్స్​ ను తీసుకువచ్చే ప్రతిపాదన చేశారు. ఈ ఆర్డినెన్స్​ ను రాహుల్​ గాంధీ అర్థంలేనిదిగా పేర్కొంటూ చించి విసిరేయాలన్నారు. 

మన్మోహన్​ సింగ్​ ను యాక్సిడెంటల్​ ప్రై మినిస్టర్​ అని కూడా అంటారు. తాను ఎన్నో బాధ్యతలు మోసానని మన్మోహన్​ సింగ్​ చెప్పేవారు. మరీ కేవలం ప్రధాని పదవిపైనే యాక్సిడెంటల్​ ప్రై మినిస్టర్​ అనడాన్ని ఆయన ప్రశ్నించారు. 2018లో ‘ఛేంజింగ్​ ఇండియా’ అనే పుస్తకంలో ది యాక్సిడెంటర్​ ప్రై మినిస్టర్​ గా అభివర్ణించారు. అనంతరం 2019లో ఇదే పేరుతో సినిమా కూడా విడుదలైంది. 

1984లో జరిగిన సిక్కు అల్లర్లు 2005 లోక్​ సభలో డా. మన్మోహన్​ సింగ్​ క్షమాపణలు చెప్పారు.  సిగ్గుతో తల దించుకుంటున్నానని అన్నారు.