ఆలయాలపై దాడి పిరికిపంద చర్య
ప్రధాని నరేంద్ర మోదీ
హింసాత్మక ఘటనలు దేశ స్థైర్యాన్ని దెబ్బతీయలేవు
చట్టబద్ధమైన పాలన కొనసాగించాలి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కెనడాలో హిందూ దేవాలయంపై ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. మంగళవారం సోషల్ మీడియాలో ప్రధాని స్పందించారు. కెనడా ప్రభుత్వం దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద చర్యలు మానుకోవాలన్నారు. హింసాత్మక ఘటనలు, బెదిరింపులు దేశ స్థైర్యాన్ని ఎప్పటికీ బలహీనపరచవన్నారు. కెనడాలో దేవాలయాలు, నిరసనకారులపై దాడిని ఖండించారు. కెనడా ప్రభుత్వం చట్టబద్ధమైన పాలనను కొనసాగించాలని ప్రధాని ఆకాంక్షించారు.