ఆలయాలపై ఖలిస్థానీల దాడి బ్రాంప్టన్​ లో హిందువుల నిరసన

Khalistani attack on temples Hindu protest in Brampton

Nov 5, 2024 - 12:09
 0
ఆలయాలపై ఖలిస్థానీల దాడి బ్రాంప్టన్​ లో హిందువుల నిరసన

దాడి నిందితులను అరెస్టు చేయకుండా హిందువులను అరెస్టు చేసిన పోలీసులు
మండిపడ్డ నిరసనకారులు
చర్యలు తీసుకోకుంటే దేశవ్యాప్త భారీ ఆందోళనలకు సిద్ధం
ఒట్టావా: కెనడాలోని హిందూ ఆలయాలపై ఖలిస్థానీల దాడిని ఖండిస్తూ భారీ ఎత్తున హిందువులు బ్రాంప్టన్​ లో ఆందోళనకు దిగారు. జై శ్రీరామ్​, ఖలిస్థానీ ముర్దాబాద్​ అంటూ నిరసన వ్యక్తం చేశారు. లక్ష్మీనారాయణ ఆలయంపై ఖలీస్థానీలు దాడికి పాల్పడ్డారు. వీరిపై ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. దాడిని చేసిన వారిని అరెస్టు చేయాలంటే హిందువులపైనే పోలీసులు లాఠీచార్జీ చేయడం ఏ మేరకు సమంజసమని నిలదీశారు. పైగా నిరసన వ్యక్తం చేస్తున్న ఇద్దరు హిందువులను ఉగ్రవాదుల మాదిరిగా అణగదొక్కి అరెస్టు చేసిన విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కెనడా ప్రభుత్వం, పోలీసులు ఉగ్రవాద దాడులను ప్రోత్సహిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇలాంటి నీతిమాలిన చర్యలకు ఖలిస్థానీలు పాల్పడుతుంటే ప్రభుత్వానికి కళ్లుమూసుకుపోయాయా? అని ప్రశ్నించారు. అరెస్టు చేసిన ఇద్దరు హిందువులను వెంటనే విడుదల చేయకుంటే పెద్ద ఎత్తున కెనడాలో హిందూ సమాజం మరోమారు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు. 
ఉగ్రవాద చర్యలు ట్రూడోకు కనిపించడం లేదా? జై శంకర్​ ఫైర్​..
ఆలయాల విధ్వంసం, హిందువుల అరెస్టును విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్​ తీవ్రంగా తప్పుబట్టారు. ట్రూడో ప్రభుత్వానికి ఉగ్రవాద చర్యలు కనిపించడం లేదా అని నిలదీశారు. వెంటనే హిందు ఆలయాలపై దాడికి పాల్పడిన ఖలిస్థానీ ఉగ్రవాదులను అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు. లేదంటే అంతర్జాతీయ వేదికపై ఈ అంశంపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.