కాంగ్రెస్ అంతం కావ‌డం ఖాయం

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంతం కావ‌డం ఖాయ‌మ‌ని డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు గులాం న‌బీ ఆజాద్ పేర్కొన్నారు.

Feb 15, 2024 - 17:12
 0
కాంగ్రెస్ అంతం కావ‌డం ఖాయం

న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంతం కావ‌డం ఖాయ‌మ‌ని డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు గులాం న‌బీ ఆజాద్ పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మంది సీనియ‌ర్లు హస్తం పార్టీని వీడటం ఆ పార్టీ దుర‌దృష్టం అన్నారు. మ‌హారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్​ కాంగ్రెస్ పార్టీని వీడటం పార్టీకి పెద్దదెబ్బ అని ఆజాద్ తెలిపారు. భ‌విష్యత్‌లో మ‌రికొంత మంది కాంగ్రెస్‌ను వీడబోతున్నట్లు త‌న‌కు స‌మాచారం ఉంద‌న్నారు. ఇప్పుడు తాను ఆ పార్టీలో లేను కాబ‌ట్టి.. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడ‌ద‌ల‌చుకోలేద‌ని ఆజాద్ పేర్కొన్నారు.