బంగ్లాలో హిందువులపై దాడి అమానుషం

ఏజీఏ సీఈవో రాబర్ట్ గ్రెగొరీ ఆగ్రహం

Aug 7, 2024 - 17:32
 0
బంగ్లాలో హిందువులపై దాడి అమానుషం

సిడ్నీ: బంగ్లాదేశ్​ లో హిందువులపై జరుగుతున్న దాడులు చాలా అమానుషమైనవని, దేవాలయాల ధ్వంసం మతోన్మాదానికి దారితీయొచ్చని ఆస్ట్రేలియన్ జ్యూయిష్ అసోసియేషన్ (ఏజీఏ) మండిపడింది. మంగళవారం ఏజీఏ సీఈవో రాబర్ట్ గ్రెగొరీ మీడియాతో మాట్లాడారు. ఇదంతా రాడికల్​ ఇస్లామిస్టులు చేస్తున్న దుశ్చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రపంచానికి రాడికల్​ ఇస్లాం నుంచి పెను ముప్పు పొంచి ఉందని అన్నారు. బంగ్లా హింసలో హిందువులూ, మైనార్టీలపై దాడులు ప్రపంచాన్ని నివ్వేరపరిచాయన్నారు. ఈ దృశ్యాలు హృదయవిదారకమన్నారు. ఇవి ప్రమాద తీవ్రతను చూపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అంతర్జాతీయ సమాజం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని రాబర్ట్​ గ్రెగొరీ స్పష్టం చేశారు.