శ్రీనగర్ మార్కెట్ లో గ్రెనేడ్ దాడి 10మందికి గాయాలు
10 people injured in grenade attack in Srinagar market
శ్రీనగర్: శ్రీనగర్ ఆదివారం మార్కెట్ లో గ్రెనేడ్ దాడి జరిగింది. 10మందికి గాయాలయ్యాయి. టీఆర్ ఎసీ కార్యాలయం సమీపంలో మార్కెట్ లో ఈ దాడి జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. దాడి నేపథ్యంలో మార్కెట్ మొత్తాన్ని సైన్యం దిగ్భంధించింది. అణువణువునా తనిఖీలు చేపట్టారు. మార్కెట్ లో మరిన్ని విస్ఫోటకాలు (బాంబులు) ఉండొచ్చన్న అనుమానంతో తనిఖీలు చేపట్టారు. మరోవైపు మార్కెట్ కు దారితీసే అన్ని రోడ్లను భద్రతా దళాలు బ్లాక్ చేసి ప్రతీఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదులు సామాన్య ప్రజానీకాన్నే టార్గెట్ గా చేసుకుంటున్నారు. ఈ దాడులపై సీఎం ఒమర్ అబ్దుల్లా తండ్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ఈయన వ్యాఖ్యలపై బీజేపీ స్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించింది.