కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి  ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ 

మాదిగలు హస్తం పార్టీకి ఓటేయొద్దు  త్వరలో మహాధర్నా 

May 4, 2024 - 17:16
 0
కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి  ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ 

నా తెలంగాణ, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో, కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మాదిగలకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. శనివారం మందకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో, కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మాదిగలకు ఎందుకు టికెట్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. మాదిగలంతా ఒక్కటై కాంగ్రెస్ ను చిత్తు చిత్తుగా ఓడించాలని సూచించారు. దేశాన్ని60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడూ మాదిగల వర్గీకరణ ఆలోచించలేదని గుర్తు చేశారు. ఎన్నికల సంఘం అనుమతితోనే కాంగ్రెస్ వ్యవహారశైలిపై మహాధర్నా చేయబోతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వివేక్ ఫ్యామిలీ టికెట్లు తెచ్చుకున్నారన్నారు. రాజ్యాంగానికి మోదీ రక్షణ కవచం అని అన్నారు.