మియాపూర్​ భూ ఆందోళన కాంగ్రెస్​ పై కేటీఆర్​ గరం గరం

KTR lashed out at the Miyapur land agitation Congress

Jun 23, 2024 - 13:42
 0
మియాపూర్​ భూ ఆందోళన కాంగ్రెస్​ పై కేటీఆర్​ గరం గరం

నా తెలంగాణ,  హైదరాబాద్​: మియాపూర్​ భూ ఆందోళనలపై బీఆర్​ఎస్​ కేటీఆర్​ మండిపడ్డారు. ఆదివారం ఎక్స్​ (ట్వీట్టర్​) మాధ్యమంగా కాంగ్రెస్​ ప్రభుత్వం పదునైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనడానికి ఈ ఘటనలే ఉదాహరణ అన్నారు. తమ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు లేవన్నారు. మియాపూర్​ భూముల్లో కొందరు గుడిసెలు వేసుకొని ఉండడంతో హెచ్​ ఎండీఏ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ సందర్భంగా పోలీసులకు గుడిసెలు వేసుకున్న వారికి మధ్య తీవ్ర గలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే.