ఆర్జీకర్ ఆసుపత్రి విధ్వంసం పోలీసులు, ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు
Arjikar hospital vandalism police, government thorn in the high court
కోల్ కతా: ఆర్జీకర్ ఆసుపత్రిలో విధ్వంసానికి ఏడువేల మంది కాలినడకనా వచ్చారా? అని పోలీసులు, సీఎం మమత ప్రభుత్వంపై కోల్ కతా హై కోర్టు మండిపడింది. ఆందోళన, ఆసుపత్రిలో విధ్వంసాన్ని అడ్డుకోవడంలో పూర్తి ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆసుపత్రి విధ్వంసం, వైద్య విద్యార్థిని హత్య పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఆసుపత్రిని మూసివేసి రోగులను ఇతర ఆసుపత్రులకు తరలిస్తే మంచిదని ప్రభుత్వానికి చురకలంటించింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది కల్పించుకొని మాట్లాడుతూ.. అక్కడ పోలీసు బలగాలున్నాయన్నారు. కోర్టు ఆయన వ్యాఖ్యలను అడ్డుకుంటూ.. ఉన్నా సొంత వ్యక్తులను కూడా రక్షించుకోలేకపోయారని వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది ఎలా పనిచేస్తారని ప్రశ్నించింది. ఈ ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కోర్టుకు పూర్తి వివరాలు అందించాలని తెలిపారు.