ప్రపంచంలో భారత్​ స్టార్టప్ దే​ కీలక భూమిక కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్​

గ్లోబల్​ ఇన్నోవేషన్​ ఇండెక్స్​లో భారత్​లో రూపొందించిన స్టార్టప్స్​ కీలక భూమిక పోషించడం అభినందనీయమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్​ అన్నారు.

Mar 20, 2024 - 16:25
 0
ప్రపంచంలో భారత్​ స్టార్టప్ దే​ కీలక భూమిక కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్​

నా తెలంగాణ, ఢిల్లీ: గ్లోబల్​ ఇన్నోవేషన్​ ఇండెక్స్​లో భారత్​లో రూపొందించిన స్టార్టప్స్​ కీలక భూమిక పోషించడం అభినందనీయమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్​ అన్నారు. బుధవారం ఢిల్లీ భారత మండపంలో జరిగిన స్టార్టప్​ మహాకుంబ్​కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. భారత్​ స్టార్టప్​ ప్రపంచాన్ని నూతనంగా తీర్చిదిద్దడంలో కీలక భూమిక పోషిస్తున్నాయన్నారు. వాజ్​పేయి జై జవాన్, జై కిసాన్​ అనేవారని, ప్రధాని నరేంద్ర మోదీ వీటితోపాటు జై స్టార్టప్స్​ యువశక్తి అంటున్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి వికసిత్​ భారత్​ సంకల్పంలో భారత్​లో 1.25 లక్షల స్టార్టప్​లు రూపొందాయని, వీటిలో 12వేల స్టార్టప్​లకు పేటేంట్​లు అందించామని మంత్రి వెల్లడించారు. ప్రపంచదేశాల్లో భారత స్టారప్​ రంగం రానున్న కాలంలో కీలక భూమిక పోషించనుందని ఇందులో ఎలాంటి సందేహం లేదని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారం చేపట్టిన పదేళ్ల కాలంలో స్టార్టప్​ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చారని, రూపకర్తలకు, విద్యార్థులు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు.