అనిల్ కు సెబీ షాక్
రూ. 26 కోట్లు జరిమానా చెల్లించకుంటే ఆస్తులు జప్తే
ముంబాయి: ఓ వైపు అన్నయ్య ముఖేష్ అంబానీ రాకెట్ వేగంతో వ్యాపార రంగంలో దూసుకుపోతుంటే.. మరోవైపేమో తమ్ముడు అనిల్ అంబానీకి తిరోగమన పవనాలు ఎదురవడమే గాకుండా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. శనివారం సెబీ అనిల్ అంబానీకి రూ. 26 కోట్ల జరిమానా విధించింది. చట్టవిరుద్ధమైన నగదు మళ్లింపు కేసుకు సంబంధించి పెనాల్ట బకాయిలు చెల్లించాలని సెబీ రిలయన్స్ బిగ్ ఎంటర్ టైన్ మెంట్ కు స్పష్టం చేసింది. రిలయన్స్ బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులు, బ్యాంకు ఖాతాలతో సహా 15 రోజుల్లోగా చెల్లింపులు చేయకపోతే సీజ్ చేస్తామని సెబీ హెచ్చరించింది. ఆగస్టులో నగదు మళ్లించారనే ఆరోపణలపై అనిల్ అంబానీ సహా మరో 24 మందిని ఐదేళ్లపాటు బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. దీంతో ఐదేళ్లపాటు ఏ లిస్టెడ్ కంపెనీ యూనిట్‌లో డైరెక్టర్‌గా పనిచేయకుండా నిషేధించింది.