పాక్ కు గాజులు వేయిస్తాం
విపక్షాలకు పాక్ అణుబాంబులు కలలోకొస్తున్నాయి ఇలాంటి వారికి దేశాన్ని అప్పజెబుదామా? ముజఫర్ పూర్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ
పాట్నా: పాక్ గాజులు వేసుకోకపోతే వేసుకునేలా భారత్ చేస్తుందని ఈ విషయంలో విపక్షాలకు అనుమానాలు అక్కరలేదని ప్రధాని మోదీ అన్నారు. పాక్ పేరు చెప్పి అణుబాంబులున్నాయంటూ ఎవరిని భయపెడుతున్నాయని విపక్షాలపై మండిపడ్డారు. రెండు రోజు బిహార్ లో ఉదయం హాజీపూర్ లో సభ అనంతరం మధ్యాహ్నం ముజఫర్ పూర్ సభలో నరేంద్ర మోదీ మాట్లాడారు. విపక్షాలపై దుమ్మెత్తి పోశారు. విపక్ష సభ్యులకు (అయ్యర్, అబ్దుల్లాలకు) రాత్రిపూట కలలో పాక్ అణుబాంబులే కనిపిస్తున్నాయని విమర్శించారు. అలాంటి వారి చేతిలో దేశాన్ని పెట్టవద్దని హెచ్చరించారు. వీరంతా దేశ వ్యతిరేక శక్తులన మండిపడ్డారు.
మోదీ జీవించి ఉన్నంత కాలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకున్న రిజర్వేషన్లు తొలగించేది లేదన్నారు. ముస్లిం రిజర్వేషన్లు కల్పించేది లేదన్నారు. రాజ్యాంగాన్ని మార్చేది ఉండబోదని కుండబద్ధలు కొట్టారు.
మోదీ సూర్యఘర్ తో నిరుపేదలు కూడా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విపక్షాలు ఘోర ఓటమిని చవి చూడబోతున్నాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.