సత్వర నిర్ణయాలకు సమయం ఆసన్నం: మోదీ
Time for quick decisions: Modi
నా తెలంగాణ, ఢిల్లీ: ఇక దేశంలో వేగంగా నిర్ణయాలు తీసుకునే సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. ప్రపంచంతో పోటీ పడాలంటే వేగవంతమైన నిర్ణయాలతోనే సాధ్యమన్నారు. సమయాన్ని వృథా చేయకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థను మూడో స్థానానికి తీసుకురావాలంటే అలాంటి నిర్ణయాలే కీలక పాత్రను పోషించగలవన్నారు. వేగవంతమైన ప్రక్రియతో దేశ అవసరాలను కూడా వేగంగా తీర్చే సత్తా లభిస్తుందన్నారు. సామర్థ్యం రెట్టింపు అవుతుందని మోదీ అన్నారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల సహకారం అవసరమని తెలిపారు. మంచిపనిలో అంతా కలిసి పోటీ పడదామని పిలుపునిచ్చారు. జీ–20న కూడా అవలీలగా నిర్వహించగలిగే భారత్ మరిన్ని ఉన్నతస్థాయి సమావేశాలతో దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నానని మోదీ హామీ ఇచ్చారు.