టైటానిక్ శిథిలాలను చూసేందుకు మరో సబ్ మెరైన్ ట్రైటాన్ సిద్ధం
Another submarine Triton is ready to see the wreckage of Titanic
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: టైటానిక్ శిథిలాలను చూసేందుకు మరో సబ్ మెరైన్ సిద్ధమవుతోందని అమెరికన్ రియల్ ఎస్టేట్ బిలియనీర్ లారీ కానర్ వెల్లడించాడు. ఇందుకోసం కానర్ ట్రైటాన్ 4000/2 ఎక్స్‌ప్లోరర్ అనే సబ్‌మెర్సిబుల్‌ను రూపొందించినట్లు తెలిపారు. దీన్ని రూపొందించేందుకు రూ.166 కోట్లు ఖర్చయిందన్నారు. సముద్రంలో 4 వేల మీటర్ల లోతుకు ట్రైటాన్ వెళ్లగలదు. అయితే ఈ జలాంతర్గామి ఎప్పుడు సముద్రంలోకి వెళుతుందనే విషయాన్ని మాత్రం కానర్ వెల్లడించలేదు.
సముద్రం ఎంత అందమైనదో అంతే శక్తివంతమైనదని కానర్ పేర్కొన్నారు. ప్రపంచానికి టైటానిక్ శిథిలాలను చూపించాలన్న ఉత్సుకతతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. తమ ఈ ప్రయాణం అన్వేషణలో నూతనాధ్యాయాన్ని సృష్టించగలదని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
గతంలో జూన్ 18న టైటాన్ సబ్‌మెరైన్ అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయింది. 4 రోజులపాటు శ్రమించి దీని శిథిలాలను టైటానిక్ నౌకకు 1600 మీటర్ల దూరంలో గుర్తించి బయటకు తీసుకువచ్చారు. ఇందులో ఐదుగురు ప్రముఖులు మృతిచెందారు. అయితే ప్రస్తుతం ట్రైటాన్ ను రూపొందిస్తున్న బిలియనీర్ లారీ కానర్ కు అమెరికా అంతరిక్ష సర్టిఫికెట్ ఉండటం గమనార్హం. ఈయన అమెరికా అంతరిక్ష యానంలో భాగస్వాములయ్యారు.