ఢిల్లీ–వారణాసి విమానానికి బాంబు బెదిరింపు

తనిఖీల్లో బాంబు లేదని నిర్ధరణ భద్రతాధికారుల విచారణ

May 28, 2024 - 14:26
 0
ఢిల్లీ–వారణాసి విమానానికి బాంబు బెదిరింపు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ–వారణాసి ఇండిగో విమానం (6ఇ–2211)లో బాంబు బెదిరింపుతో తీవ్ర అలజడి రేగింది. వెంటనే స్పందించిన సిబ్బంది, అధికారులు విమానంలోని 176 మంది ప్రయాణికులను ఎమర్జెన్సీ ఎగ్జిట్​ డోర్ల ద్వారా సురక్షితంగా కిందకు దించారు. మంగళవారం ఉదయం 5.30 గంటలకు ఈ విమానం బయలుదేరేందుకు సిద్ధంగా ఉండగా విమానంలోని టైయ్​ లెట్​ లో టిష్యూ పేపర్​ పై బాంబు ఉందని అరగంటలో పేలబోతోందని రాసి ఉన్న విషయాన్ని పైలెట్​ గుర్తించి వెంటనే విమాన సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఏవియేషన్​ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి ప్రయాణికులను, సిబ్బందిని దించి వేసి ఐసోలేషన్​ సెంటర్​ కు తీసుకువెళ్లి బాంబు స్క్వాడ్​ ద్వారా తనిఖీలు చేపట్టారు. విమానంలో బాంబు లేదని నిర్ధరించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా విమానంలో ఈ టిష్యూపై ఎవరు బాంబు హెచ్చరికలను రాసి పెట్టారన్న విషయంపై ఢిల్లీ విమానాశ్రయ భద్రతాధికారులు విచారణ చేపట్టారు.

ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో ఉత్తుత్తి బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇవన్నీ విదేశాల నుంచి వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు.