నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: దేశవ్యాప్తంగా ఐదు రాష్ర్టాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపును శనివారం చేపట్టారు. ఈ ఫలితాల్లోనూ బీజేపీ హావా కొనసాగుతోంది. పలు రాష్ర్టాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించగా, పలుచోట్ల ముందంజలో కొనసాగుతున్నారు.
అస్సోం: దోహాలో బీజేపీ అభ్యర్థి నిహర్ రంజన్ దాస్ ముందంజలో కొనసాగుతున్నారు. బెహాలీ స్థానంలో బీజేపీ అభ్యర్థి దిగంతా ఘటోవాల్ 9051 ఓట్ల తేడాతో, 50947 ఓట్లు సాధించి గెలుపొందారు. ఐదు స్థానాలకు గాను రెండు స్థానాల్లో బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించి మరో స్థానంలో విజయం దిశగా దూసుకుపోతుంది.
బిహార్: తరారీ స్థానంలో బీజేపీ అభ్యర్థి విశాల్ ప్రశాంత్, రామ్ గర్ లో అశోక్ కుమార్ సింగ్ లు విజయం సాధించారు. నాలుగు స్థానాల్లో రెండు స్థానాల్లో బీజేపీ విజయం కైవసం చేసుకుంది.
చత్తీస్ గఢ్: చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ నగరం సౌత్ లో బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్ సోనీ ముందంజలో కొనసాగుతున్నారు. ఇక్కడ ఒకే స్థానంలో ఉప ఎన్నికలు జరిగాయి.
గుజరాత్: గుజరాత్ లో ఒక స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఠాకూర్ స్వరూప్ సర్దార్ (బీజేపీ) ముందంజలో కొనసాగుతున్నారు. ఒకే స్థానంలో ఎన్నికలుజరిగాయి.
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ లో రెండు స్థానాల్లో ఎన్నికలు జరగ్గా బుధాని స్థానంలో బీజేపీ అభ్యర్థి రమాకాత్ భార్గవ్ ముందంజలో కొనసాగుతున్నారు.
రాజస్థాన్: రాజస్థాన్ లోని ఝూంజున్ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర బాంబూ, రామ్ గర్ లో సుఖ్వంత్ సింగ్, ధోలీలో రాజేంద్ర గుర్జర్ , కిణ్వ్సర్ లో రేవంత్ రామ్ దంగా, సాలంబర్ లో శాంతా అమృత్ లాల్ మీనా ముందంజలో కొనసాగుతుండగా, చౌరాసీ థానంలో బీజేపీ అభ్యర్థి అనిల్ కుమార్ కట్రా విజయం సాధించారు.
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అభ్యర్థి కుందర్కీ రాంవీర్ సింగ్, ఘజియాబాద్ సంజీవ్ శర్మ, కైర్ సురేందర్ దిల్హేర్, పుల్పూర్ దీపక్ పటేల్, కేతేహారి ధర్మరాజ్ నిషాద్, మజ్హాన్ ఎస్. మౌర్యలు ముందంజలో కొనసాగుతున్నారు.
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ కేదార్ నాథ్ లో ఆశా నౌట్యాల్ విజయం సాధించారు.