హిందూ విద్యార్థులపై ఉపాధ్యాయుడి దాడులు
తల్లిదండ్రుల ఆందోళన సస్పెండ్, న్యాయ సంహిత కేసు నమోదు
శ్రీనగర్: హిందూ మతాన్ని కించపరిచడం, ఆ మతానికి చెంది విద్యార్థులపై విచక్షణ రహితంగా కొడుతుండడంతో ఉపాధ్యాయుడు ఆరీఫ్ ఇక్బాల్ ను సస్పెండ్ చేశారు. అధికారిక విచారణ పూర్తి కావడంతో గురువారం విద్యాశాఖా ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని భదర్వాలోని మంథాలా హైస్కూల్‌లో హిందూ విద్యార్థులే టార్గెట్ గా వారిని, మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నాడని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు నిజమేనని జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. అంతేగాక విద్యార్థినులు అని చూడకుండా కొట్టేవాడని పలువురు విద్యార్థులు వాపోయారు. ఈ నేపథ్యంలో పలుమార్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తూ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిని ఉపాధ్యాయులుగా ఎలా నియమిస్తారని పెద్ద యెత్తున పాఠశాల ముందు ఆందోళన చేయడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
హిందూ మతానికి చెందిన విద్యార్థులను ఏదో కారణాన్ని సాకుగా చూపుతూ కొట్టడం, విద్యార్థినులను కూడా తీవ్రంగా కొట్టడంతో పలువురికి చెవి, ముక్కుపోగులు సైతం విరిగిపోయి గాయాలయ్యాయి. దీనిపై పెద్ద యెత్తున తల్లిదండ్రులు ఆందోళన చేపట్టడంతో దిగి వచ్చిన దోడా విద్యాశాఖాధికారి ఆరీఫ్ ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
తల్లిదండ్రులు ఆరీఫ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా అతనిపై న్యాయ సంహితలోని సెక్షన్ 299 కింద బాదేర్వా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐఆర్ నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.