రాష్ట్రపతి మూడు దేశాల పర్యటన

President's three-nation tour

Oct 13, 2024 - 18:33
 0
రాష్ట్రపతి మూడు దేశాల పర్యటన

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఆదివారం అల్జీరియా పర్యటనకు బయలుదేరారు. ఏడు రోజుల పర్యటనలో అల్జీరియా, మౌరిటానియా, మలావి దేశాలలో పర్యటించనున్నారు. 13 నుంచి 16 వరకు అల్జీరియాలో, 16న మౌరిటానియాలో, 17 నుంచి 19 వరకు మలావిలో పర్యటిస్తారు. ఆఫ్​రికన్​ యూనియన్​ దేశాలను జీ–20లో సభ్యదేశాలుగా చేసిన సందర్భంగా రాష్ట్రపతి ఈ దేశాల పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది. 
ఈ మూడు దేశాల్లోనూ ద్వైపాక్షిక బంధాలు, సంబంధాలపై చర్చలు నిర్వహించనున్నారు. ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. పీపుల్​ డెమోక్రటిక్​ రిపబ్లిక్​ ఆఫ్​ అల్జీరియా అధ్యక్షుడు అబెద్​ ల్మడ్జిద్​ టెబౌన్​ తో సమావేం కానున్నారు. ఆదేశ అమరవీరుల స్మారక చిహ్నానికి నివాళులర్పించనున్నారు. రాష్ట్రపతి భవన్​ ను సందర్శించి అక్కడ జరిగే ఎకనామిక్​ ఫోరమ్​ లో ప్రసంగిస్తారు. మౌరిటానియా పర్యటనలో అధ్యక్షుడు మహ్మద్​  ఔల్డ్​ గజానీ, మలావిలో అధ్యక్షుడు లాజరస్ మెక్‌కార్తీ చక్వేరాలతో భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు.