అంబేద్కర్​ స్ఫూర్తితోనే  బీజేపీ మేనిఫెస్టో

మధ్యప్రదేశ్​ సీఎం మోహన్​ యాదవ్​

Apr 14, 2024 - 16:33
Apr 14, 2024 - 16:34
 0
అంబేద్కర్​ స్ఫూర్తితోనే  బీజేపీ మేనిఫెస్టో

భోపాల్: డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ స్ఫూర్తిగా బీజేపీ సంకల్ప్ పత్రాన్ని జారీ చేసిందని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అన్నారు. ఆదివారం ఔషంగాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ప్రాథమిక స్ఫూర్తిని అర్థం చేసుకొని ముందుకు వెళుతున్నామని అన్నారు. బీజేపీకి ఐదు విధేయతలున్నాయని అందులో ఒకటి ప్రజాస్వామ్యం అని అన్నారు. కాంగ్రెస్ చేయలేని పనిని తాము నిర్విఘ్నంగా చేసి చూపామన్నారు. టీ అమ్మే కుటుంబం నుంచి వచ్చిన ప్రధాని మోదీ దేశంలో ప్రజాస్వామ్య విలువలను కీలకభూమిక పోషించారని కొనియాడారు. ఆయన వల్లే నేడు భారత్ కీర్తి ప్రఖ్యాతలు ప్రపంచంలో ఫరిడవిల్లుతున్నాయని చెప్పారు.