పాక్​ తో చర్చల్లేవ్​

విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జై శంకర్​

Oct 5, 2024 - 18:19
 0
పాక్​ తో చర్చల్లేవ్​

సమస్యలను ఇతర శక్తులకు వదలిపెట్టం
సర్ధార్​ పటేల్​ విధానాలనే అనుసరిస్తాం
ప్రపంచదేశాల్లో అస్థిరత ఆందోళనకరం
ఉగ్రవాదం ప్రపంచశాంతికి భంగమే

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​ – పాక్​ తో సంబంధాల గురించి ఎలాంటి చర్చలు జరపమని ఎస్​.జైశంకర్​ అన్నారు. అక్టోబర్​ 15–16 పాక్​ పర్యటనపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జై శంకర్​ నోరు విప్పారు. తాను ఎస్​ సీవో (షాంఘై కో ఆపరేషన్​ సదస్సు)కు వెళుతున్నానని అన్నారు. అందులో సభ్యునిగా ఉన్నందుకు మాత్రమే వెళుతున్నానని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడారు. పాక్​ పై సర్దార్​ పటేల్​ విధానాలను కీర్తించారు. భారత్​ సొంత సమస్యను ఐక్యరాజ్యసమితిని తీసుకువెళ్లడాన్ని కూడా పటేల్​ వ్యతిరేకించారని గుర్తు చేశారు. భారత్​ తన సమస్యలను ఇతర శక్తులకు వదిలిపెట్టకూడదన్నది ఆయన విధానం అన్నారు. అదే విధానానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. పాక్​ తో సత్సంబంధాలనే కోరుకున్నా ఉగ్రవాదాన్ని మాత్రం క్షమించలేమన్నారు. సార్క్​ సదస్సు కూడా అందుకే ముందుకు సాగడం లేదన్నారు. ఇందుకు పాక్​ ఉగ్రవాదమే కారణమన్నారు. మధ్యప్రాచ్యం దేశాలలో ఉద్రిక్తతలు తీవ్ర విచారకరమన్నారు. ఉగ్రవాదం వల్ల ప్రపంచశాంతికి భంగం వాటిల్లుతోందని మరోసారి ఋజువైందన్నారు. ప్రపంచంలోని యుద్ధాలు అస్థిరత పెరగడానికి దారితీయొచ్చని మంత్రి జై శంకర్​ స్పష్టం చేశారు.