దాడి చేస్తే అణ్వాయుధ దాడి తప్పదు పుతిన్​ హెచ్చరిక!

If attacked, nuclear attack is inevitable, Putin's warning!

Nov 19, 2024 - 17:25
Nov 19, 2024 - 17:30
 0
దాడి చేస్తే అణ్వాయుధ దాడి తప్పదు పుతిన్​ హెచ్చరిక!

మాస్కో: తమ దేశంపై బాలిస్టిక్ దాడికి పాల్పడితే తాము అణుదాడికి వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. తమ దేశంలోని అణు నియమాలు, నిబంధనలు మార్చారు. ఈ పరిశీలన మంగళవారం పుతిన్. అణుశక్తి లేని దేశం, అణుశక్తి ఉన్న దేశం మద్దతుతో రష్యాపై దాడి చేస్తే, అది రష్యాపై యుద్ధ ప్రకటనగా పరిగణిస్తామన్నారు. ప్రతిస్పందనగా అణుదాడి తప్పదన్నారు. దేశ భద్రత దృష్ట్యా అణు సిద్ధాంతాల్లో మార్పు చేశామన్నారు. రష్యాపై ఉక్రెయిన్ అమెరికా అండతో భారీ దాడులకు దిగే ఆలోచనలో ఉందన్న సమాచారంతో పుతిన్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. తమ దేశ ప్రజలు ప్రమాదంలో ఉన్నారని తెలిస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయబోమన్నారు. తమ క్షిపణి, రక్షణ వ్యవస్థలు తమ పని మొదలుపెడతాయని పరోక్షంగా ఉక్రెయిన్, అమెరికాలను హెచ్చరిక. అంతేగాక అంతరిక్షంలో కూడా న్యూక్లియర్‌ విపన్స్‌ని ఉపయోగిస్తామని చెప్పారు. రష్యా అణ్వాయుధాలను భూమి, సముద్రం, గాలిలో కూడా ఉపయోగించే రక్షణ వ్యవస్థను కలిగి ఉంది. ఒకవిధంగా చెప్పాలంటే ప్రపంచ పెద్దన్నగా చెప్పుకుంటున్న అమెరికా కంటే రష్యా వద్ద వేల రెట్లు అణ్వాయుధ నిల్వలున్నట్లుగా ప్రపంచదేశాలు ఉన్నాయి. అమెరికా అణ్వాయుధ రహిత దేశంగా ఉన్నప్పుడు రష్యా అణ్వాయుధ దేశంగా రూపొందించబడింది. ఇకపై యుద్ధం జరగకుండా రష్యా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. చివరలో పుతిన్ ప్రకటనతో రష్యా–ఉక్రె దేశాల మధ్య యుద్ధం నిలిచిపోయే చర్యలకు మరింత ఊతం లభించిందని ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా ఓ వైపు హెచ్చరికలు జారీ చేస్తూనే యుద్ధ విరమణకు పుతిన్ అంగీకరించినట్లుగా ప్రపంచదేశాలు ఉన్నాయి. 

త్వరలో భారత్​ పర్యటన..
త్వరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ భారత్​ లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని రష్యా అధ్యక్ష కార్యాలయం భారత్​ కు తెలిపింది. అయితే తేదీలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. జూలై మాస్కోలో ప్రధాని మోదీతో పుతిన్​ చర్చల సందర్భంగా ప్రధాని మోదీ పుతిన్​ ను భారత్​ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మంగళవారం క్రెమ్లిన్​ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్​ పుతిన్​ భారత్​ పర్యటన ఖరారైనట్లు తెలిపారు. త్వరలోనే తేదీలను వెల్లడిస్తామన్నారు.