వయోనాడ్​ లో ప్రధాని ఏరియల్​ సర్వే

Prime Minister aerial survey in Wayonad

Aug 10, 2024 - 14:52
 0
వయోనాడ్​ లో ప్రధాని ఏరియల్​ సర్వే

తిరువనంతపురం: వయోనాడ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్​ సర్వే నిర్వహించారు. శనివారం ఉదయం కన్నూర్​ కు చేరుకున్నారు. ఏరియల్​ సర్వేలో ప్రధాని మోదీ వెంట గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర పర్యాటక, పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపిలు కూడా ఉన్నారు.

కేరళ ప్రభుత్వం వరద సహాయంగా రూ. 2వేల కోట్లను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. వరదల వల్ల 400కు పైగా మరణించగా, అనేకమంది ఆచూకీ తెలియకుండా పోయింది. ఇది అత్యంత పెద్ద ప్రకృతి విపత్తుగా అధికారులు తెలిపారు. ఏరియల్​ సర్వేలో నష్టం వివరాలను సీఎం పినరయి విజయన్​ ను ప్రధాని అడిగి తెలుసుకున్నారు.