అలుపెరుగని మహానీయుడు అంబేద్కర్
వర్థంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు ఖార్గేతో ప్రధాని కరచాలనం, ముచ్చట!
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సమానత్వం, నిరుపేదల సంక్షేమం కోసం అలుపెరుగని మహానీయుడు డాక్టర్.బీ.ఆర్. అంబేద్కర్ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం అంబేద్కర్ 69 వర్థంతి సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో మహాపరినిర్వాణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అంబేద్కర్ కు నివాళులర్పించారు. అనంతరం ప్రధాని తన అభిప్రాయాలను పంచుకున్నారు. రాజ్యాంగ నిర్మాత ప్రతీ ఒక్కరి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకున్నారని అన్నారు. అంబేద్కర్ పోరాట పటిమ తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంబేద్కర్ నిబద్ధత భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాళులర్పించేందుకు రాగా ఆయనతో కరచాలనం చేస్తూ మాట్లాడారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్రమంత్రులు, ఎంపీలు అంబేద్కర్ కు నివాళులర్పించారు.