రెండు రోజుల్లో అధికారిక నివాసం ఖాళీ

వెల్లడించిన ఆప్​ వర్గాలు

Oct 2, 2024 - 14:24
 0
రెండు రోజుల్లో అధికారిక నివాసం ఖాళీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆప్​ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి మరో రెండు రోజుల్లో నూతన చిరునామాకు మారనున్నట్లు బుధవారం ఆప్​ వర్గాలు తెలిపారు. సీఎంగా అతిశీ ప్రమాణ స్వీకారం తరువాత ఆయన నివాసం ఖాళీ చేయనున్నారు. నిరంతరం ఆయన ప్రజలతో మమేకమై ఉండాల్సి వస్తుంది కాబట్టి ఆయన నివాసం విశాలంగా, సౌకర్యంగా ఉండాలని అందుకే ఆలస్యం అయిందని తెలిపారు. ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, కౌన్సిలర్లు, మంత్రులు, సాధారణ సమావేశాల నేపథ్యంలో న్యూ ఢిల్లీ అయితేనే సౌకర్యవంతంగా భద్రతాపరంగా ఉంటుందని ఆప్​ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో 2025 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన వినూత్న పంథాలో సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు.