మహిళా చైతన్యానికి ప్రతీక ఐలమ్మ

Ailamma is a symbol of female consciousness

Sep 10, 2024 - 21:50
 0
మహిళా చైతన్యానికి ప్రతీక ఐలమ్మ

నా తెలంగాణ, రామకృష్ణాపూర్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు మంగళవారం రామకృష్ణాపూర్ రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ నాయకులు గాండ్ల సమ్మయ్య, రజక సంఘం నాయకులతో కలిసి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ  సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక, పోరాట స్పూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప్పలయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.