కాంగ్రెస్​ మెడకు ఉచితాల ఉచ్చు

Congress is a trap for freebies

Nov 20, 2024 - 10:58
 0
కాంగ్రెస్​ మెడకు ఉచితాల ఉచ్చు
విద్యుత్​ సంస్థ బకాయిలూ చెల్లించలే
ఢిల్లీ హిమాచల్​ భవన్​ స్వాధీనానికి హై కోర్టు ఆదేశం
కొత్త అప్పులకూ తప్పని తిప్పలు
తలపట్టుకుంటున్న సీఎం సుఖ్వీందర్​ సింగ్​ సుఖూ
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: కాంగ్రెస్​ పాలిత రాష్ర్టమైన హిమాచల్​ ప్రదేశ్​ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వోద్యోగులకు కనీసం జీతాలివ్వలేని పరిస్థితులు నెలకున్నాయి. జీతాల సంగతి అటుంచితే విద్యుత్​ సంస్థలకు కూడా బకాయిలు చెల్లించలేక చేతులెత్తేసింది.  లాహౌల్-స్పితిలో 320 మెగావాట్ల హైడల్ ప్రాజెక్ట్ కేటాయింపు కోసం ముందుగా చెల్లించిన రూ. 64 కోట్ల ప్రీమియం వడ్డీతో సహా కలిపి రూ. 150 కోట్లయ్యింది. ఈ మొత్తాన్ని చెల్లించడంలో సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ ప్రభుత్వం విఫలమవడంతో ఆ సంస్థ కోర్టునాశ్రయించింది. దీంతో రాష్ర్ట హై​ కోర్టు ఢిల్లీలోని హిమాచల్​ ప్రదేశ్​ ను స్వాధీనం (అటాచ్​) చేయాలని ఆదేశించింది.
 
ఉచితాల ఊబిలోకి ప్రభుత్వం
రాష్ర్టవ్యాప్తంగా 2.2 లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు, 1.89 లక్షల మంది పదవీ విరమణ పొందిన వారికి పెన్షన్​ ఇచ్చేందుకు ప్రతీనెలా కొత్త అప్పులను తెచ్చుకుంటోంది. వేతనాలకు రూ. 1200కోట్లు, పెన్షన్​ కు రూ. 800 కోట్లు చెల్లించాలి. ప్రతీనెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తామని బీరాలకు పోయిన హిమాచల్​ ప్రదేశ్​ మెడకు ఉచిత ఉచ్చు చిక్కుకొంటోంది, బయటపడలేని ఊబిలోకి నెట్టివేస్తుంది. 
 
వడ్డీ మిగులుతుందనే వేతనాలు ఆలస్యం..
జీతాలు ఐదు, పది రోజులు ఆలస్యం చేస్తే దానిపై వచ్చే వడ్డీ మిగులుతుందని ప్రభుత్వ వేతనాలను ఆలస్యం చేస్తుందనే ఆరోపణలున్నాయి. దీంతో ప్రతీ నెలా రూ. 3 కోట్లు, యేడాదికి రూ. 36 కోట్లు ఆదా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు రాష్ర్ట ఖజానాలో దమ్మిడి కూడా లేదని అధికారుల ద్వారా స్పష్టమవుతుంది. దీంతో జీతాలనివ్వడంలో ప్రతీనెలా కటకట నెలకుంటుంది. 
 
కేంద్రం గ్రాంట్లు చెల్లిస్తున్న తిప్పలు తప్పట్లే..
కేంద్రం హిమాచల్​ ప్రదేశ్​ కు చెల్లించాల్సిన రూ 8,058 కోట్ల అన్ని గ్రాంట్లను సక్రమంగానే చెల్లిస్తుంది. కానీ కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారం కోసం ప్రజకు ఇచ్చిన ఉచిత హామీలు (ఫ్రీబీస్​)తో చిక్కులు ఏర్పడుతున్నాయి. తాహతుకుమించిన హామీలనిచ్చి అమలు చేయలేక ప్రజల్లో విమర్శలపాలవుతూ.. అమలు చేయాలని తిప్పలు పడుతూ కొత్త కష్టాను కోరి తెచ్చుకుంటుంది. ప్రతీనెలా కొత్త అప్పులను తీసుకువస్తుంది. ప్రస్తుతం ఆ రాష్ర్టానికి అప్పు తెచ్చుకునే పరిస్థితులు కూడా లేవు. తెచ్చుకున్న​ అప్పులకే వడ్డీలు సరిపోతుండగా, హామీలు, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ విఫలమవుతుంది. ఆర్థిక చిక్కుముళ్ల నేపథ్యంలో సీఎం, కాంగ్రెస్​ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రెండు నెలలు వేతనాలను ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సీఎం విజ్ఞప్తి చేయడం ఆ రాష్ర్ట ఆర్థిక పరిస్థితికి అద్ధం పడుతుంది. 
 
కేంద్ర నిధులు ఇతర అవసరాలకు..
2025–26లో ఈ రెవెన్యూ లోటు కాస్త మరింత పెరిగి ప్రజావసరాలకు దమిడి పుట్టడం కూడా గగనంగానే మారనుంది. మరోవైపు 2023లో హిమాచల్​ లో వరద నష్టాలు తీవ్రంగా ఉండడంతో 9,042 కోట్ల ఆర్థిక నష్టం వాటల్లింది. కేంద్రం తమ వంతు నిధులను అందజేసి ఆదుకుంది. ఆ నిధులను సుఖూ ప్రభుత్వం వడ్డీలకు, అవసరాకు మళ్లించింది. ప్రస్తుతం కేంద్రం ఏం ఇవ్వలేదని అబద్ధాలను ప్రచారం చేసే బాధ్యతను తలకెత్తుకుంది. 
 
కాంగ్రెస్​ పై మండిపడ్డ మాజీ సీఎం జైరామ్​ ఠాకూర్​..
అధికారం కోసం అలవికాని హామీలనిచ్చి ఆర్థికంగా పటిష్టంగా ఉన్న హిమాచల్​ ను కాంగ్రెస్​ ప్రభుత్వం బయటపడలేని ఆర్థిక అగాధంలోకి నెట్టిందని మాజీ సీఎం జైరామ్​ ఠాకూర్​ మండిపడ్డారు. సకాలంలో అప్పులు తీర్చకుండా కొత్త అప్పులకు వెళుతూ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమన్నారు. 
 
హామీలు బోలేడు.. అమలు మూరెడే..
గతంలో కాంగ్రెస్ ప్రకటించిన 10 ఉచిత హామీలలో ముఖ్యమైనవి 300 యూనిట్ల ఉచిత విద్యుత్, 18 నుంచి 60 ఏళ్లలోపు మహిళలందరికీ నెలకు రూ.1500, స్టార్టప్ యూనిట్ల ఏర్పాటుకు వీలుగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒక్కొక్కరికి రూ.10 కోట్లు. ఇవి గాక, రైతులు, వృద్ధులకు, ఉద్యోగులకు పెన్షన్ల పెంపు, మహిళలకు ఆర్థిక స్వావలంభన కింద రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు, విద్య, వైద్యం, స్కాలర్​ షిప్​ లు ఇలా అలవిగాని ఉచిత హామీలను ఇచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్​ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి ఆశించిన మేర అమలు కావడం లేదు. 
 
కాంగ్రెస్​ పాలిత రాష్ర్టాలన్నింటిది అదే దారి..
హిమాచల్​ తోపాటు కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారం చేపట్టిన రాష్​ర్టాలన్నింటిలో పరిస్థితులు ఆర్థిక దిగ్భంధనంలో చిక్కుకున్నాయి. బయటికి మాత్రం అన్ని హామీలు అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్నా, ఒకటి, అర తప్పి మిగతా హామీల అమలులో కాంగ్రెస్​ ప్రభుత్వం చతికిలపడింది. తెలంగాణ, కర్ణాటక, కేరళలు కూడా ఉచితాల భారం మోయలేక హిమాచల్​ ప్రదేశ్​ ఆర్థిక స్థితులవైపు పయనిస్తున్నాయని ఈ రాష్ర్టాలు కూడా ఆర్థిక బంధనాల్లో ఇరుక్కుపోయాయని ఆర్థిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.