మోదీ రాజనీతి.. భారత్ కు జీ–7 గిఫ్ట్
ఐఎంఈసీ రహదారితోపాటు హైస్పీడ్ రైల్వేకు పచ్చజెండా
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: జీ–7లో భారత్ కు పెద్ద బహుమతి లభించింది. మోదీ ఆశిస్తున్నట్లుగానే ఐఎంఈసీ (భారత్–పశ్చిమ ఆసియా–యూరోప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు రహదారితోపాటు హైస్పీడ్ రైలు, షిప్పింగ్ నెట్ వర్క్ ను కూడా అనుసంధానిస్తామని జీ–7 దేశాలు తెలిపాయి. దీంతో ఇటీవలి ప్రపంచ యుద్ధ పరిణామాల నేపథ్యంలో వాయిదా పడుతుందనుకున్న ఈ ప్రాజెక్టుపై మళ్లీ ఆశలు చిగురించాయి. ఎట్టకేలకు మోదీ కల ఫలించింది.
వాణిజ్యం పెరుగుదల..
ఈ ప్రాజెక్టు పూర్తి అయితే భారత్ – యూరప్, పశ్చిమాసియా దేశాల మధ్య అనేక రెట్లు వాణిజ్యం పెరుగుతుంది. తొలుత భావించిన రహదారి నిర్మాణామే కాకుండా హైస్పీడ్ రైలుకు కూడా జీ–7 దేశాలు పచ్చజెండా ఊపడంతో ఇందుకు సంబంధించిన ప్రాజెక్టు పనుల రూపకల్పన త్వరలో చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
విశ్వసనీయత, నమ్మకాలను నిలబెట్టుకున్న మోదీ..
జీ–7 భారత్ భాగస్వామ్య దేశం కాకున్నా, ఆహ్వానిత దేశమే అయినా ప్రధాని మోదీ విదేశీ నీతి వల్ల అనేక ప్రాజెక్టుల కలను సాకారం చేసుకోగలుగుతుంది. పలువేదికలపై ప్రపంచమంతా ఒకే కుటుంబమని పలుమార్లు మోదీ విశ్వసనీయత, నమ్మకాలను చాటారు. దీంతో భారత్ అపారమైన అవకాశాలను చేజిక్కించుకోగలుగుతుంది.
మెలోని కృషి..
ఏది ఏమైనా అతిముఖ్యమైన ఐఎంఈసీ ప్రాజెక్టుకు జీ–7దేశాలు ఓకే చెప్పడం వెనుక ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కృషి కూడా దాగి ఉందనే చెప్పుకోవాలి. ఆమె ప్రత్యేక ఆహ్వానం మేరకే మోదీ వెళ్లిన విషయం తెలిసిందే.
ఈ ప్రాజెక్టు పూర్తి అయితే చైనా బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పై నీలినీడలు కమ్ముకోనున్నాయి.