అక్నూర్ ప్రమాదం విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి
Aknoor accident The President expressed regret
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్ లో బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మరణవార్త విని చాలా బాధపడ్డానని రాష్ట్రపతి తన సందేశంలో తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.