సైబర్​ మోసాల విలువ రూ. 13,930 కోట్లు!

2023–24 నివేదికలో ఆర్బీఐ వెల్లడి

May 30, 2024 - 18:34
 0
సైబర్​ మోసాల విలువ రూ. 13,930 కోట్లు!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలో బ్యాంకింగ్​ రంగ మోసాలు 2023–24కు సంబంధించి రూ. 13,930కోట్లుగా ఉందని ఆర్బీఐ గురువారం వెల్లడించిన ఓ నివేదికలో పేర్కొంది. గతేడాది రూ. 26,127 కోట్లుగా ఉందని పేర్కొంది. 46.7 శాతం మోసాలు తగ్గాయని పేర్కొంది. ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కార్డుల ఉపయోగం, ఇంటర్నెట్​ బ్యాంకింగ్​ వినియోగం, డిజిటల్​ చెల్లింపుల ద్వారా ఈ మోసాలు జరిగాయని తెలిపింది. ప్రస్తుతం సైబర్​ మోసాలపై అవగాహన కల్పిస్తుండడం, బ్యాంకులు భద్రతు పాటిస్తుండడంతో మోసాల సంఖ్యను తగ్గించగలుగుతున్నామని పేర్కొన్నాయి. ప్రైవేట్​ రంగ బ్యాంకుల్లో అత్యధిక మోసాలు నమోదవుతున్నాయని ఆర్బీఐ నివేదిక పేర్కొంది. 

రుణాల పేరుతోనే సైబర్​ మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నాయి. 2022–23, 2023–24 మధ్య కాలంలో జరిగిన మోసాలను గమనిస్తే మోసాలకు కారణం ఆలస్యమేనని తెలుస్తోందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది.