మేజర్ రాజేంద్ర ప్రసాద్ రూపొందించిన ఐఈడీ పరికరం
పేటెంట్ లభ్యం, పరీక్షల్లో విజయవంతం
డ్రోన్ ద్వారా ప్రయోగం ఉగ్రస్థావరాలు ధ్వంసం
సాంకేతికతతో ఐఈడీ అనుసంధానం
స్వదేశీ ఉత్పత్తి రంగానికి బంగారు భవిష్యత్
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఉగ్రవాద కార్యకలాపాలను తగ్గించేందుకు, వారిని, వారి స్థావరాలను తుదముట్టించేందుకు పూర్తి స్వదేశీయంగా రూపొందిన ‘ఆగ్నేయ్ అస్త్ర’ ఆర్మీకి అందింది. దీనికి పూర్తి పెటెంట్ కూడా దక్కింది. ఈ ఆగ్నేయ్ అస్ర్త అనే పేరు గల పరికరాన్ని తయారు చేసింది. భారత ఆర్మీలోని సీనియర్ అధికారి మేజర్ రాజేంద్ర ప్రసాద్ కావడం గమనార్హం. ప్రధాని మోదీ స్వదేశీ ఆయుధీకరణలో భాగంగా ఇన్నోవేషన్ ద్వారా ఈ అత్యాధునిక పరికరాన్ని రూపొందించారు. దీన్ని డ్రోన్ ద్వారా ప్రయోగించి ఉగ్రస్థావరాలను నాశనం చేయనున్నారు. అదే సమయంలో ఉగ్రకార్యకలాపాలను తగ్గించనున్నారు.
ఆగ్నేయ్ అస్త్ర
ఇది మల్టీటార్గెట్ పేలుడు పరికరం. చిన్నపాటి సూట్ కేసులో దీన్ని ఎక్కడికైనా తీసుకువెళ్లే సౌలభ్యాన్ని కలిగి ఉంది. దీని పరిధి 2.5 కిలోమీటర్లు. ఏకకాలంలోనే అనేక లక్ష్యాలను చేధించగలదు. బంకర్లు, ఉగ్రస్థావరాలు లాంటి వాటిని నష్టం చేస్తుంది. దీన్ని డ్రోన్ ద్వారా ప్రయోగించి రిమోట్ ద్వారా పేలుడు నిర్దేశాలిస్తారు. దీని రూపకల్పన 2023 ఏడాది చివరిలోనే జరిగినా.. పూర్తి స్థాయి పరీక్షల అనంతరం 2024 అక్టోబర్ 11న ఆర్మీకి అందజేశారు. ఇందులో ఎక్స్ ప్లోజర్ డైనమో, కెపాసిటర్ లు ఉన్నాయి. మైక్రోప్రాసెసర్ ఎలక్ర్టానిక్ పరికరం. వైర్ తోనూ, వైర్ లెస్ గానూ దీన్ని ఉపయోగించవచ్చు. ఒకవిధంగా చెప్పాలంటే ఇది పూర్తి స్వదేశీయంగా, అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఐఈడీ (ఎలక్ర్టానిక్ ఇంప్రూవైజ్డ్ డివైజ్) పేలుడు పదార్థం బాంబు.
ఈ పరికరాన్ని దేశంలోని సరిహద్దుల్లో ఉపయోగించాక ఆర్మీ పెద్ద యెత్తున తయారీకి ఉపక్రమించనుంది. ఏది ఏమైనా ప్రధాని మోదీ చెప్పిన ఇన్నోవేషన్, ఇంక్యూబేషన్ లతో స్వదేశీ ఉత్పత్తుల రూపకల్పనతో భవిష్యత్ లో భారత్ సువర్ణ భారత్ గా రూపుదిద్దుకునేందుకు ఎంతో దూరంలో లేదనే చెప్పొచ్చు.