నా తెలంగాణ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాయత్రిపురం అగ్రహారంలో అమ్మవారి నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఆదివారం నిమజ్జనోత్సవంలో బ్రాహ్మణులు, మహిళలు కలిసి అమ్మవారికి సారేను సమర్పించారు. నిర్మల్ జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం సమితి రాష్ట్ర సహ కారదర్శి సిరిగె. రమేష్ శర్మ మాట్లాడుతూ.. దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.
హిందూ ధర్మం, దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఐక్యతతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణ మహిళలు ఇలాంటి కార్యక్రమాలలో ముందుకు వచ్చి హిందూ ధర్మం పట్ల తమ భక్తిని చాటడం సంతోషమన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు బ్రాహ్మణులు సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పెరిమానుల అరుణ్ కుమార్ ఎల్కూచి రాజేశ్వర్ శర్మ, కోటముర్తి గంగాధర్ శర్మ దేశ్ పాండే సాయికుమార్, మహదేవ్ శ్రీనివాస్, శంకర్, మనోహర్, మదన్, రమణయ్య, మహిళలు సిరిగె.మాయ, శ్రీలక్ష్మి, అర్చన, మదుబాల, షర్మిలా, అశ్విని తదితరులు పాల్గొన్నారు.