హైబ్రిడ్ మ్యాచ్ లను ధృవీకరించిన ఐసీసీ
ICC approved hybrid matches
తలొగ్గిన పీసీసీబీ, సంతోషం వ్యక్తం చేసిన బీసీసీఐ
త్వరలోనే షెడ్యూల్ ప్రకటించే అవకాశం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఎట్టకేలకు ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కంట్రోల్ బోర్డు) ప్రతిపాదనకు పీసీబీ (పాక్ క్రికెట్ కంట్రోల్ బోర్డు) తలొగ్గింది. 2025లో జరగనున్న ఐసీసీ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్ కు అంగీకరించింది. భారత్ అంగీకరించిన హైబ్రిడ్ మోడల్ కు ఓకే లభించడం పట్ల బీసీసీఐ (భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు) సంతోషం వ్యక్తం చేసింది. గురువారం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ–2025ను హైబ్రిడ్ మోడల్ నిర్వహణ విషయాన్ని ధృవీకరించింది. పూర్తి షెడ్యూల్ ను ఇంకా ప్రకటించలేదు.
భారత్ జరిగే ఇతర దేశాల మ్యాచ్ లన్నీ తటస్థ వేదికలపైనే జరగనున్నాయి. 2025 ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, పురుషుల టీ–20 ప్రపంచకప్ 2026లో భారత్ – శ్రీలంకలో జరగనున్నాయి. ఫిబ్రవరి, మార్చిలో షెడ్యూల్ చేసిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆతిథ్య పాకిస్తాన్లున్నాయి. 2012–-13లో చివరిసారిగా ద్వైపాక్షిక సిరీస్ ఆడిన భారత్, పాకిస్థాన్‌లు ఇప్పుడు ప్రధానంగా ఐసీసీ ఈవెంట్‌లు, ఆసియా కప్‌లలో కలుస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్నారు.