నవనీత్ రాణాకు గ్యాంగ్ రేప్ బెదిరింపు లేఖ!
Gang rape threatening letter to Navneet Rana!
ముంబాయి: మాజీ ఎంపీ, బీజేపీ మహిళా నేత నవనీత్ రాణాకు గ్యాంగ్ రేప్ బెదిరింపు లేఖ వచ్చింది. బెదిరింపు లేఖపై నవనీత్ రాణా సహాయకుడు వినోద్ ఉగహే రాజాపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లేఖ పంపిన వ్యక్తి తనను తాను అమీర్ గా పేర్కొంటూ.. తన ఫోన్ నెంబర్ ను కూడా లేఖపై రాశాడు. అంతేగాకుండా రూ. 10 కోట్లు డిమాండ్ కూడా చేశాడు. ఇంటిముందు ఆవును వధిస్తానని చెప్పాడు. పాక్ జిందాబాద్ అని రాశాడు. లేఖలో ఎంపీ, ఆమె భర్త పట్ల పలు అభ్యంతరకర వ్యాఖ్యలను రాశాడు. లేఖపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 2024 అమరావతి నుంచి పోటీచేసిన నవనీత్ రాణా ఓటమి పాలయ్యారు. పలుమార్లు పాక్, ఎంపీ అసద్, అక్బర్ వ్యాఖ్యలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏమైనా బెదిరింపులు వచ్చాయా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.