కల్తీ మద్యం.. 54 చేరిన మృతుల సంఖ్య

Adulterated liquor.. 54 number of dead

Jun 23, 2024 - 13:13
 0
కల్తీ మద్యం.. 54 చేరిన మృతుల సంఖ్య

చెన్నై: తమిళనాడు కల్తీ మద్యం ఘటనలో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారంనాటికి ఆ సంఖ్య 54కు చేరుకుంది. మరో 15 నుంచి 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో ఉన్న బాధితులను పలువురు పరామర్శించి ధైర్యం చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ.. గతేడాది 22 మంది చెందినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం వల్లే మరో ఉపద్రవం చోటు చేసుకుందని మండిపడ్డారు. ప్రజలకు పరిహారం ఇచ్చి చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవాలని స్టాలిన్​ ప్రభుత్వం భావిస్తోందని మండిపడ్డారు. అక్రమ సారాబట్టీలపై పారదర్శక విచారణ జరగాల్సిందేనని ఆయన డిమాండ్​ చేశారు. సీబీఐ చేత దర్యాప్తు చేయించాలన్నారు. 

కాగా ఈ కేసులో తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఏడుగురు నిందితులను అరెస్టు చేసింది. ప్రభుత్వం ఉన్నతాధికారులతో బృందాన్ని దర్యాప్తునకు నియమించింది. దర్యాప్తు బృందంలోని సీనియర్​ అధికారి ప్రశాంత్​ మీడియాతో మాట్లాడుతూ.. దర్యాప్తునకు అందరూ సహకరించాలని కోరారు. పూర్తి పారదర్శకంగా దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు.