అదానీకే శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ నిర్వహణ బాధ్యతలు
లాభాల్లో అదానీ షేర్లు
కోల్ కతా: అదానీ గ్రూప్ కు మరో పెద్ద కాంట్రాక్టు లభించింది. కోల్ కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ లో కంటైనర్ సౌకర్యాలు, నిర్వహణను దక్కించుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం అదానీ పోర్ట్ సెజ్ మీడియాకు వెల్లడించింది. బిడ్డింగ్ పోటీ ప్రక్రియ ద్వారా పోర్ట్ నిర్వహణ బాధ్యతలను దక్కించుకున్నామని తెలిపారు. ఒప్పందం ప్రకారం ముఖర్జీ పోర్ట్ లో సరకు రవాణా పరికరాలను ఒప్పందం ప్రకారం ఏడు నెలల్లోగా అమర్చాల్సి ఉంటుంది. ఒప్పందం ఐదేళ్లపాటు కొనసాగనుంది. దేశంలో ఓడరేవు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే తమ నిబద్ధతగా భావిస్తున్నట్లు అదానీ పోర్ట్ సీఈవో అశ్విని గుప్తా తెలిపారు. పోర్టులో కాంట్రాక్టు దక్కడం సంతోషకరమన్నారు. పోర్ట్ లో లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి అనుగుణంగా పనులు నిర్వహిస్తామన్నారు. కాంట్రాక్టు దక్కడంతో పశ్చిమ బెంగాల్ లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన చేకూరుతుందన్నారు.
కాగా శుక్రవారం అదానీ పోర్ట్స్ షేర్లు లాభాలతో ముగిశాయి. బిఎస్‌ఇలో కంపెనీ షేర్లు 1.93 శాతం, రూ.26 లాభంతో రూ.1378 వద్ద ముగిశాయి. ఈ షేరులో 52 వారాల గరిష్టం రూ. 1607, 52 వారాల కనిష్టం రూ.702. బీఎస్‌ఇలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,97,850.76 కోట్ల వద్ద ముగిసింది.