కాంగ్రెస్​ కు షాక్​ .. ఎమ్మెల్యే రావత్​ బీజేపీలో చేరిక

A shock to Congress.. MLA Rawat joins BJP

Apr 30, 2024 - 15:25
 0
కాంగ్రెస్​ కు షాక్​ .. ఎమ్మెల్యే రావత్​ బీజేపీలో చేరిక

భోపాల్​: మధ్యప్రదేశ్​ లో కాంగ్రెస్​ పార్టీకి మరోసారి షాక్​ తగిలింది. మంగళవారం విజయపూర్​ అసెంబ్లీకి చెందిన కాంగ్రెస్​ ఎమ్మెల్యే రాంనివాస్​ రావత్​ బీజేపీలో చేరారు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికకావడం విశేషం. సీఎం మోహన్​ యాదవ్​, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణుదత్ శర్మ, మాజీ మంత్రి నరోత్తమ్ మిశ్రా సమక్షంలో రామ్​ నివాస్​ రావత్​ బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ఓబీసీ వర్గానికి చెందిన ముఖ్య నేతగా రావత్​ ను భావిస్తారు. కాగా మంగళవారం ఉదయం రావత్​ ఎంపీ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ తో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శివరాజ్​ సింగ్​ చౌహాన్​ కాంగ్రెస్​ పై మండిపడ్డారు. కాంగ్రెస్​ పార్టీ దేశాన్ని భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. మధ్యప్రదేశ్​ ప్రభుత్వం సీఎం మోహన్​ యాదవ్​ కు శివరాజ్​ సింగ్​ లాడ్లీ బెహనా పథకం కొనసాగింపుపై కృతజ్ఞతలు తెలిపారు.