సెక్స్​ ఆరోపణలపై మాజీ ప్రధాని మనవడు ప్రజ్వల్​ సస్పెండ్​

ఎఫ్​ ఐఆర్​ నమోదు నేపథ్యంలో జేడీఎస్​ నిర్ణయం

Apr 30, 2024 - 14:35
 0
సెక్స్​ ఆరోపణలపై మాజీ ప్రధాని మనవడు ప్రజ్వల్​ సస్పెండ్​

బెంగళూరు: కర్ణాటక సెక్స్ ఆరోపణల నిందితుడు, మాజీ ప్రధాని హెచ్​ డీ దేవెగౌడ మనవడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (33)ను పార్టీ నుంచి సస్పెండ్​ చేస్తున్నట్లు మంగళవారం జేడీఎస్​ ప్రకటించింది. ప్రజ్వల్​ పై లైంగిక వేధింపుల ఆరోపణల కింద ఎఫ్​ ఐఆర్​ నమోదు కావడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. 200కి పైగా అభ్యంతరకర వీడియోలు వైరల్​ కావడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ నెల ఏప్రిల్​ 26న రెండోదశ ఎన్నికలలో రేవణ్ణ ఓటు వేశారు. అనంతరం జర్మనీకి వెళ్లారు. హసన్​ లోక్​ స్థానం నుంచి ప్రజ్వల్​ మళ్లీ పోటీలో ఉండడం విశేషం.