మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ
చైనా–భారత్ బంధాలను బలహీనపర్చబోం
సైనిక నిర్ణయంపై పున:సమీక్ష
మంచి భాగస్వామ్యాన్నే కోరుకుంటున్నాం
నమ్మకం, విశ్వాసాలతో ముందుకెళతాం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత సార్వభౌమత్వానికి, గౌరవ, మర్యాదాలకు భంగం వాటిల్లే పనులు ఎన్నటికీ మాల్దీవులు చేయదని మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ గతం గతహా అన్నారు. సోమవారం రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధాని నరేంద్ర మోదీ లను కలిశారు. మొయిజ్జూకు రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా సైనిక త్రివిధ దళాలు మొయిజ్జూకు వందనం సమర్పించాయి. అంతకుముందు మొయిజ్జు మీడియాతో మాట్లాడారు. చైనా–భారత్ మధ్య పలు రకాల సమస్యల నేపథ్యంలో భారత్ ను బలహీన పరిచేలా ఎలాంటి చర్యలను తాము తీసుకోమని హామీ ఇచ్చారు. గతంలో తమదేశ ప్రజల భావాలను గౌరవించే భారత సైనికులకు తిరిగి పంపామన్నారు. ఈ నిర్ణయాన్ని మరోమారు పున:సమీక్షించాలని నిర్ణయించామన్నారు. ఈ మధ్య మాల్దీవులు ప్రజల మనోభావాలలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు.
మాల్దీవులు–భారత్ ల మధ్య విలువైన భాగస్వామ్యాన్ని, దౌత్యసంబంధాలను తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఇదే సమయంలో పరస్పర గౌరవం, నమ్మకం, విశ్వాసాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. భారత్ తమకు చిరకాల మంచి మిత్రుడని ఆకాశానికెత్తారు. ఇరుదేశాల్లోని మరోమారు బలోపేతం అవుతున్న బంధాలు భద్రత, స్థిరత్వానికి భంగం కలిగించకుండా చూసుకుంటామని, కట్టుబడి ఉన్నామని మొయిజ్జూ స్పష్టం చేశారు.
భారతీయులు మాల్దీవుల పర్యాటనకు రావాలని వారికి ఆతిథ్యం, గౌరవ, మర్యాదాలు అందజేయడం తమ బాధ్యత అని హామీ ఇచ్చారు.