బెంగళూరు పేలుడు నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షల రివార్డు
బెంగళూరు రామేశ్వరం పేలుళ్ల కేసులో నిందితుడి గురించి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డును ఎన్ఐఏ బుధవారం ప్రకటించింది.
బెంగళూరు: బెంగళూరు రామేశ్వరం పేలుళ్ల కేసులో నిందితుడి గురించి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డును ఎన్ఐఏ బుధవారం ప్రకటించింది. సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉంచుతామని పేర్కొంది. నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి టోపీ, ముసుగు, అద్దాలు ధరించాడు. ఇంకా అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ రివార్డు నిర్ణయం తీసుకుంది. ఫొటోలో ఉన్న వ్యక్తే రామేశ్వరం కేఫ్ లోని హ్యాండ్ వాష్ ప్రాంతంలో ఓ బ్యాగ్ ను ఉంచాడు. అందులో టైమర్ తో కూడిన ఐఈడీని అమర్చారు. బ్యాగు పెట్టిన ఓ గంటకు పేలుడు సంభవించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. నిందితుడు అంతవరకు అదే ప్రాంతంలో ఉండి రిమోట్ సహాయంతో బాంబును పేల్చినట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. పేలుడు సందర్భంగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.