హిజ్బుల్లా చీఫ్​ గా నయీమ్​ ఖాసిం

Naeem Qasim as Hezbollah chief

Oct 29, 2024 - 15:10
 0
హిజ్బుల్లా చీఫ్​ గా నయీమ్​ ఖాసిం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: హిజ్బుల్లా నూతన చీఫ్​ గా నయీమ్​ ఖాసిం ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఇతను ఇరాన్​ లో ఉన్నాడు. ఇజ్రాయెల్​ వరుసగా హిజ్బుల్లా, హమాస్​ ఉగ్రవాద నాయకులను టార్గెట్​ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ రెండు ఉగ్రసంస్థలే గాక హౌతీ, ఇరాన్​ లకు కూడా భారీగానే నష్టం వాటిల్లింది. గాజా, లెబనాన్​  దేశాలు సుమారుగా భస్మీపటలంగా మారుతున్నాయి. ఆ దేశాల్లో ప్రజలు నివసించే పరిస్థితులు రోజురోజుకు గగనమవుతున్నాయి. కాగా ప్రస్తుతం ఐడీఎఫ్​ రాడార్​ లో నయీమ్​ ఖాసిం ఉన్నారు. మరోవైపు నయీమ్​ ఇజ్రాయెల్ కు హెచ్చరికలు జారీ చేశారు. కాల్పుల విరమణను ఇజ్రాయెల్​ ప్రకటించే వరకు హిజ్బుల్లా తమ కార్యకలాపాలను ఆపాబోదని హెచ్చరించారు. నయీమ్​ 1970లో రసాయన శాస్ర్త విద్యార్థి. 1974 నుంచి 1988 వరకు ఇస్తామిక్​ విద్యకు అధిపతిగా పనిచేశారు. 1991లో హిజ్బుల్లాకు డిప్యూటీ సెక్రెటరీ జనరల్​ గా ఎన్నికయ్యాడు.