తిరంగా ర్యాలీకి అనుమతి నిరాకరణ
డీఎంకేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటీజన్లు
చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ ‘హర్ ఘర్ తిరంగా’ పిలుపు మేరకు తమిళనాడులోని తిరువళ్లూరు గుమ్మిడి పూండి పట్టణ అధ్యక్షుడు నటరాజన్ తిరంగా ర్యాలీకి డీఎంకే ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో తిరంగా ర్యాలీపై అనుమతి నిరాకరణను నటరాజన్ లేఖలతో సహా డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ బుధవారం సోషల్ మీడియాలో పెట్టారు.
ఇటీవల కరుణానిధి ర్యాలీని ఆ పార్టీ పెద్ద యెత్తున ర్యాలీ నిర్వహించిందని గుర్తు చేశారు. అప్పుడు రాని ట్రాఫిక్ సమస్య దేశ భక్తిని చాటుకునే తిరంగా ర్యాలీకి అడ్డంకిగా ఎలా మారిందని మండిపడ్డారు.
కాగా ఈయన పోస్ట్ కు విశేష స్పందన లభిస్తోంది. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశభక్తిని ప్రదర్శించకుండా అడ్డుకుంటున్న డీఎంకే పార్టీ ఏ దేశంలో ఉందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని మండిపడుతున్నారు.