ఋణమాఫీపై ఆందోళనలొద్దు
Don't worry about loan waiver
సంయమనం పాటించాలి
అందరికీ మాఫీయే లక్ష్యం
స్పెషల్ డ్రైవ్ నిర్వహణ
పలు లోపాల గుర్తింపు
బ్యాంకుల తప్పిదాలు కూడా కారణమే
అధికారుల దృష్టికి వివరాలు
ఋణమాఫీ అయిన వారికి తిరిగి రుణాలివ్వాలని సీఎంకు విజ్ఞప్తి
బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఆడే గజేందర్
నా తెలంగాణ, బోథ్: రైతు ఋణమాఫీ మూడో విడతలో తమ పేర్లు లేవని అర్హులైన రైతులెవ్వరు అధైర్యపడొద్ధని, ప్రతిపక్షాల మాయ మాటలకు లొంగి ఆందోళనలు చేయవద్దని, సంయమనం పాటించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.
ఆదివారం ఆయన మీడియా సమావేశంలో ఋణమాఫిపై మాట్లాడారు. రైతాంగానికి రెండు లక్షల ఋణమాఫీ చేస్తానన్న భాగంలో ఏకకాలంలో మూడు విడతలుగా రెండు లక్షల రూపాయల మాఫీ జరిగిందని, చిన్నచిన్న తప్పిదాల వల్ల కొంతమంది రైతులకు ఋణమాఫీ అందలేదన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతామని, పేర్లు తప్పుగా నమోదై, రెండు బ్యాంకులలో రుణం ఉండడం, ఒకే రేషన్ కార్డులో ఎక్కువ మంది రైతులు ఉండడం, రెండు లక్షలు దాటి ఉండడం, సాంకేతిక సమస్యల కారణంగా ఇంకా కొందరు రైతులకు ఋణమాఫీ కాలేదన్నారు. ప్రభుత్వం వీటన్నింటినీ గుర్తించిందన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతులందరికీ ఋణమాఫీ చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల 600మంది రైతుల పేర్లు గల్లంతైనట్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. త్వరలోనే వారందరికీ న్యాయం చేకూరుస్తామన్నారు.
ఋణమాఫీ అయిన రైతులకు తిరిగి పంట ఋణాలు అందజేయాలని కోరనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోత్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, పిఎసిఎస్ డైరెక్టర్లు గొర్ల రాజు యాదవ్, లోలపు పోశెట్టి, చట్లా ఉమేష్, అనిల్ అప్ప, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డి, మండల అధ్యక్షుడు సుద్దుల అరుణ్ రెడ్డి, గడ్డల నారాయణ, షేక్ అబుద్ తదితరులు పాల్గొన్నారు.