రేవంత్ పాలన బాగాలేదు
Revanth's rule was not good
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
మహిళలకు ఉచిత బస్సు తప్ప ఏం ఇచ్చిండు?
హైడ్రా, మూసీ పేరుతో ఇళ్లు కూల్చిండు
నా తెలంగాణ, హైదరాబాద్ : రాష్ట్రంలో రేవంత్ పాలన తీరు బాగాలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. సీఎంగా రాష్ట్రానికి ఆయన ఏ వర్గానికి మంచి చేయలేదని ఆరోపించారు. శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఏడాది పాలనపై ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు మినహా ఏ హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. హైడ్రా, మూసీ పేరుతో ఇళ్లు కూల్చారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి గ్యారంటీ, హామీని అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి.. ప్రజలు హామీల గురించి అడగగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.