యూఎన్​ ఎస్​ సీ విస్తరణకు భారత్​ మద్ధతు

విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జై శంకర్​

Nov 28, 2024 - 18:20
 0
యూఎన్​ ఎస్​ సీ విస్తరణకు భారత్​ మద్ధతు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: విస్తరించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జై శంకర్​ అన్నారు. గురువారం ఈ అంశంపై రాజ్యసభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. యూఎన్​ ఎస్​ సీ సంస్కరణల చర్చల్లో భారత్​ నిమగ్నమైందన్నారు. భారత్​, జపాన్​, బ్రెజిల్​, జర్మనీ, ఆసియా, ఆఫ్రికా, లాటిన్​ అమెరికా లాంటి జీ–4 దేశాలతో కలిసి సభ్యత్వం, యూఎన్​ ఎస్​ సీ విస్తరణ కోసం కలిసి పనిచేస్తోందన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం గ్లోబల్ సౌత్ దేశాలతో నిరంతరం చర్చిస్తుందన్నారు. యుఎన్‌ఎస్‌సిని సంస్కరించే ప్రక్రియకు ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు సవరణలు అవసరమన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమగ్ర సంస్కరణలకు పెద్ద సంఖ్యలో దేశాలు మద్దతు ఇచ్చాయని స్పష్టం చేశారు. పీ–5 దేశాలు, అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకె వంటి అనేక దేశాలు కూడా సంస్కరించబడిన భద్రతా మండలిలో శాశ్వత సభ్యునిగా భారతదేశం అభ్యర్థిత్వాన్ని ఆమోదించాయని జైశంకర్ స్పష్టం చేశారు.